తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ సర్టిఫికేట్లు, సంక్షేమ పథకాల కోసం మండల, పట్టణ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామాల్లోనే డిజిటల్ పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ భారత్, నాబార్డ్ సహకారంతో ఆగస్టు 15 నాటికి 562 సహకార సంఘాల్లో సీఎస్‌సీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, బిల్లుల చెల్లింపు, టికెట్ బుకింగ్, ఐటీ రిటర్న్స్ వంటి అనేక సేవలు ఇక్కడ లభిస్తాయి.