దసరా కానుకగా ఉద్యోగులకు రెండు డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు కలిపి 6.4 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దసరా పండుగ కానుకగా ఈ మొత్తాన్ని అక్టోబర్ 1న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదించి, ఈ నెలాఖరు నాటికి పీఆర్సీ నివేదిక తెప్పించి, వచ్చే ఏడాది మార్చి నాటికి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. సీపీఎస్ రద్దుపై 3 నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగాల్సిన జేఏసీ సమావేశాన్ని వాయిదా వేశారు. మొత్తం 69 సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలు నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕