TG: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా ఇందిరమ్మ ప్రభుత్వం నడిపిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఖమ్మం(D) నేలకొండపల్లి మండలంలో రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో సూర్దేపల్లి నుంచి బోదులబండ వరకు, రూ. 4.5 కోట్లతో మంగాపురం తండా నుంచి నాచేపల్లి, బాణాపురం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు.