ఉపాధి పనుల్లో ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. గ్రౌండ్‌ లెవెల్‌లో జరిగే అవకతవకలను నివారించడమే లక్ష్యంగా, మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు వాస్తవ సమయలో ట్రాక్ చేయనున్నారు. ఈ నిబంధన కమ్యూనిటీ పనులపై మార్చి 2 నుంచి అమలులోకి వచ్చింది. త్వరలో వ్యక్తిగత లబ్ధిదారుల పనులకూ దీనిని వర్తింపజేయనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సర్క్యులర్‌ను అధికారికంగా విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్