TG: రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యుల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి ఈ ప్రక్రియ మొదలై 11 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. మొత్తం 10 రోజుల్లో టీచర్ల ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. జూన్ 30 వరకు ఖాళీ అయిన స్థానాలతో భర్తీ చేయనున్నారు. అయితే దీనికి ముందే ట్రాన్స్‌ఫర్స్ చేపట్టాల్సి ఉండగా.. స్కూల్స్ ప్రారంభమవడంతో ఆ నిర్ణయాన్ని సర్కార్ వాయిదా వేసి ప్రమోషన్లు మాత్రం కల్పించాలని నిర్ణయించింది.