టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK

ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలంటూ విద్యాకమిషన్ సర్కారుకు నివేదిక ఇచ్చిందన్న వార్తలపై విద్యాకమిషన్ సభ్యుడు కే. కేశవరావు స్పందించారు. ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించదని ఆయన స్పష్టం చేశారు. జీతాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతున్నామని, ప్రభుత్వం నెల రోజుల్లో కొత్త విద్యా విధానాన్ని తీసుకువస్తుందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్