తెలంగాణలో భూముల విలువ పెంపుపై ప్రభుత్వం కసరత్తు!

TG: రాష్ట్రంలో భూముల విలువ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాంతాల వారీగా భూముల విలువను గరిష్ఠంగా 100%, కనిష్ఠంగా 25% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న విలువ మధ్య భారీ తేడా ఉన్న ప్రాంతాల్లో 75% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యత్యాసం 15%లోపే ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ఉండబోదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్