రాష్ట్రంలో నానో యూరియా పంపిణీకి ప్రభుత్వం కసరత్తు

TG: రాష్ట్రంలో ప్రస్తుతం యూరియాను యాప్‌ ద్వారా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై నానో యూరియాను కూడా యాప్ ద్వారా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి అనుగుణంగా యూరియా యాప్‌లో సాంకేతికంగా మార్పులు చేయనుంది. నిల్వలు, లభ్యమయ్యే దుకాణాలు, ఇతర సమాచారం చేర్చనుంది. అలాగే నానో యూరియాను పిచికారీ చేసేందుకు భారీఎత్తున హ్యాండ్‌ స్ప్రేయర్లను సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్