TG: పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. 3 వారాలు గడిచినప్పటికీ గత ఓటరు జాబితాతో పోలిస్తే సగం దరఖాస్తులు కూడా రాలేదు. ఎన్నికల సిబ్బంది ఎస్ఐఆర్లో నిమగ్నం కావడం వల్ల గ్రాడ్యుయేట్ ఓట్ల దరఖాస్తుల పరిశీలన నత్తనడకగా సాగుతోందని అంటున్నారు. హైదరాబాద్ సహా 4 జిల్లాల్లో ఇంకా మొదలే కాలేదు. 2 నియోజకవర్గాల్లో కలిపి గతంలో సుమారు 10.30 లక్షల ఓట్లు ఉండగా, ఈసారి ఇప్పటి వరకు సుమారు 4.35 లక్షల దరఖాస్తులే వచ్చాయి. MBNR-RR-HYD పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,91,360 దరఖాస్తులు రాగా, WGL-KMM-NLG నియోజకవర్గంలో 2,44,349 దరఖాస్తులు వచ్చాయి.