పాడి రైతులకు రాయితీపై గడ్డి విత్తనాలు

TG: ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా సుమారు 1,000 టన్నుల గడ్డి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కసరత్తు చేస్తోంది. విత్తనాల సేకరణ, నాణ్యత, సరఫరా బాధ్యతలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (సీడ్స్ కార్పొరేషన్)కు అప్పగించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.12 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇందులో 75 శాతం నిధులను కేంద్రం సమకూర్చనుండగా.. మిగిలిన 25 శాతం రైతులు భరించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్

✕
✕