TG: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీలత రాష్ట్రంలో అత్యధిక నార్మల్ డెలివరీలు చేసినందుకు రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీలత, గతంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినప్పుడు కూడా ఇదే తరహాలో అత్యధిక నార్మల్ డెలివరీలు చేసినందుకు తొలిసారి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అందుకున్నారు.