హెచ్‌‌1బీ వీసా రూల్స్‌‌.. మార్చి 30 నుంచి సోషల్ మీడియా తనిఖీ తప్పనిసరి

అమెరికా హెచ్‌‌1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మార్చి 30 (సోమవారం) నుంచి వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించడంతో పాటు వాటిని పబ్లిక్ మోడ్‌లో ఉంచాలి. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం, కాన్సులేట్ అధికారులు దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులు, ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఇతర డిజిటల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ మార్పులు వీసా స్క్రీనింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేస్తాయి.

సంబంధిత పోస్ట్