వాట్సాప్‌లో హాల్ టిక్కెట్లు.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

TG: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాల్ టిక్కెట్లను వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టిక్కెట్లను వాట్సాప్ చేయడం ద్వారా వాటిలో ఏవైనా పొరపాట్లు ఉంటే పరీక్షలకు ముందే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందే తల్లిదండ్రులకు హాల్ టిక్కెట్లను వాట్సాప్ చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్