హనుమాన్ జయంతి.. మద్యం దుకాణాలు బంద్!

హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం (ఏప్రిల్ 2) మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం, ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లలో మద్యం అమ్మకాలను నిషేధించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మినహాయింపు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు, లైసెన్సుల రద్దు ఉంటుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్