హైస్పీడ్ రైలు నమూనాను ఏ దేశం ఆవిష్కరించింది?

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు నమూనాను దిళి 450 పేరుతో ఇటీవల చైనా ఆవిష్కరించింది. ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ (280 miles) వేగాన్ని అందుకోవడం గమనార్హం. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్ 400 మోడల్ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుంది. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు.

సంబంధిత పోస్ట్