అర్జెంటీనా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం రాత్రికి రాత్రే 23 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయిందని, సముద్రం ఎండిపోతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, వాతావరణ మార్పుల వల్ల తాత్కాలికంగా చోటుచేసుకున్న సహజసిద్ధ ప్రక్రియ అని అర్జెంటీనా జాతీయ మీడియా సంస్థ స్పష్టం చేసింది. బలమైన గాలుల వల్ల నీటిమట్టం అకస్మాత్తుగా తగ్గడం, రాతి నిర్మాణాలు బయటకు కనిపించడం వంటివి జరిగాయని, ఇది సాధారణ ఆటుపోట్లలో భాగమని, కొద్ది గంటల్లోనే నీటిమట్టం సాధారణ స్థితికి చేరుకుందని శాస్త్రవేత్తలు వివరించారు.