HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెండ్

TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావును అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావుపై కూడా వేటు వేసింది. గల నెల 28న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సీఐడీ, ఈడీ సంస్థల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు HCA వెల్లడించింది. కాగా ప్రస్తుతం జగన్‌మోహన్‌రావు రిమాండ్‌లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్