TG: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదని స్పష్టం చేసింది. వీడియోలు చూసి తాము ఆందోళనకు లోనయ్యామని, అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరమని వ్యాఖ్యానించింది.