హాంకాంగ్‌కు చెందిన ఒలివియా చియుంగ్ కేసు వైద్య చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచింది. దశాబ్దం క్రితం తాను దాదాపు చనిపోయి మళ్లీ బతికిన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు ఫుల్మినెంట్ మయోకార్డిటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా గుండె 63ని.ల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. క్వీన్ మేరీ హాస్పిటల్‌లో వైద్యుల కృషి కారణంగా తిరిగి జీవించా’ అని తెలిపింది. ప్రస్తుతం ఒలివియాకు 30 ఏళ్లు.