బక్రీద్‌కు గోవులను బలివ్వడంపై హైకోర్టు కీలక ఆదేశాలు

బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను, దూడలను వధించకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో గోవధను నివారించాలంటూ కోయంబత్తూరుకు చెందిన సూర్య ప్రశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జిఆర్.స్వామినాథన్, జస్టిస్ వి.లక్ష్మినారాయణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జంతు వధను చట్టబద్ధంగా ఆమోదించబడిన వధశాలలకు మాత్రమే పరిమితం చేయాలని, ఆవులు, దూడలు, వ్యవసాయానికి ఉపయోగపడే పశువుల వధను నిషేధించే దిశగా కృషి చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్