TG: సల్కం చెరువులోని ఒవైసీ విద్యాసంస్థల భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న తమ విద్యాసంస్థల భవనాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సదరు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉందని, మరో ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. అయితే భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్నారని, భవనంపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.