సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మధ్యంతర ఆదేశాలకు నిరాకరించిన హైకోర్టు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన పిటిషన్‌లో మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తెలుగు భాషలో మాత్రమే దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉండటం వల్ల ఇతర భాషలు మాట్లాడే ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ఎం. ముజీబ్ అయూబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే, బీఎల్‌వోల వద్ద తెలుగు ఫారాలతో పాటు ఆంగ్లం, ఉర్దూ నమూనా ఫారాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఫారాలు ఎన్ని భాషల్లో ముద్రిస్తున్నారో వివరాలు సమర్పించాలని కోర్టు ఈసీని ఆదేశించి, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్