కేరళ స్టోరీ-2 పై హైకోర్టు స్టే.. సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం

విడుదలకు ఒక్కరోజు ముందు 'ది కేరళ స్టోరీ 2' సినిమాకు న్యాయపరమైన అడ్డంకి ఏర్పడింది. కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని ఆరోపణలు రావడంతో, సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఎఫ్‌సీ తీరును తప్పుపట్టిన న్యాయస్థానం, సినిమాను పునఃపరిశీలించాల్సిందిగా సూచిస్తూ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు విడుదల నిలిపివేస్తున్నట్లు ఆదేశించింది. ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్