గ్రూప్-1 నియామకాలపై ఇవాళ హైకోర్టు తీర్పు

TG: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించనుంది. పరీక్షల నిర్వహణ, కరెక్షన్ వంటి నిబంధనల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా నేడు ఇచ్చే తీర్పుతో 562 పోస్టులపై క్లారిటీ రానుంది.

సంబంధిత పోస్ట్