హిందూ వివాహంపై హైకోర్టు సంచలన తీర్పు

సంప్రదాయబద్ధంగా పెళ్లి జరగకుండా, కేవలం వివాహ ధ్రువపత్రం మాత్రమే ఉంటే అది చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. పిటిషనర్ వాదన ప్రకారం, ఓ మత గురువు తన సంస్థలో చేర్చుకోవాలి అని తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆమె తండ్రి వద్దకు వెళ్లి ‘మీ కుమార్తెను పెళ్లి చేసుకున్నా’ అని వివాహ ధ్రువపత్రం చూపించాడు. దీంతో యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

సంబంధిత పోస్ట్