జూరాల వద్ద ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్

TG: వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జూరాల ప్రాజెక్ట్ వద్ద సాగునీరు విడుదల చేయాలని రైతులకు మద్దతుగా వెళ్లిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తరలిస్తుండగా రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕