హుక్కా బార్ల వ్యాపార హక్కు కిందకు రాదు: అలహాబాద్ హైకోర్టు

హుక్కా బార్లను నడపడం పౌరుల ప్రాథమిక వ్యాపార హక్కు కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. పొగాకు, నికోటిన్ వాడకం వల్ల ప్రజారోగ్యానికి కలిగే ముప్పును దృష్టిలో ఉంచుకుని, వీటిపై ఆంక్షలు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని స్పష్టం చేసింది. హుక్కా బార్ నిర్వాహకులు తమ వ్యాపార హక్కును కాపాడాలని వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. యువత ఆరోగ్యం దెబ్బతింటుందని, సమాజానికి హాని చేసే ఇలాంటి అలవాట్లను వ్యాపార హక్కు కిందకు తీసుకురాలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

సంబంధిత పోస్ట్