అమర్‌నాథ్‌లో మంచు శివలింగం ఎలా ఏర్పడుతుందంటే?

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో గుహలోని మంచు శివలింగం సహజంగా ఎలా ఏర్పడుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. శ్రీనగర్‌కు ఈశాన్యంగా 145 కిలోమీటర్ల దూరంలో, 4,000 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహలో సున్నపురాయి, జిప్సం శిలల పగుళ్ల ద్వారా హిమనదాలు, మంచు కరిగిన నీరు నెమ్మదిగా గుహలోకి చేరుతుంది. లోపల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఆ నీరు ఒక్కో పొరగా గడ్డకట్టి, పైకి ఎదిగే మంచు స్తంభమే భక్తులు దర్శించే మంచు శివలింగం. దీనిని భూగర్భ శాస్త్రంలో ‘ఐస్ స్టాలాగ్‌మైట్‌’ అంటారు. యాత్ర సమయంలో భక్తుల రాకపోకలతో లోపలి ఉష్ణోగ్రత పెరిగి మంచు వేగంగా కరుగుతుంది.

సంబంధిత పోస్ట్