హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో బాలికపై వీధికుక్క దాడి చేసిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి, ఘటనపై తీసుకున్న చర్యలను నివేదించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. అమలులో ఉన్న నివారణ చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 24లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.