TG: 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం.. 2026–27 నుండి 2030–31 మధ్య కాలంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి సుమారు రూ. 9,968 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్లపాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగించడం వల్ల 2023–24, 2024–25 నిధులు నిలిచిపోయాయని, ఎన్నికల తర్వాతే కేంద్రం వాటిని విడుదల చేసిందని చెప్పారు.