ప్రధాని మోదీ జులై 12న దేశవ్యాప్తంగా 51,000 మందికి నియామక పత్రాలు అందించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ 16వ రోజ్‌గార్ మేళా సందర్భంగా ఆయా వ్యక్తులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల్లో చేరనున్నారు. దేశంలోని 47 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, ప్రధాని ప్రసంగించి కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారిని అభినందించనున్నారు.