కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట మెయిన్ రోడ్డులో మల్లన్న గుడి సమీపంలో గత పది రోజులుగా డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి తెలిపారు. అధికారులు సమస్యను పరిశీలించినా పరిష్కరించలేదని ఆయన విమర్శించారు. మురుగు నీళ్ల మధ్యే కూరగాయల మార్కెట్ నిర్వహించడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని, బౌరంపేటలో పలు ప్రాంతాల్లో రెండేళ్లుగా డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను కోరారు.