సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు జిఎస్ఎమ్ మాల్, మదినగూడలోని బార్బెక్యూ నేషన్‌లో తనిఖీలు నిర్వహించాయి. సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు, వాటర్ టెస్టింగ్ రిపోర్టులు ఉన్నప్పటికీ, లేబుల్ లేని బ్రౌనీలు, కుల్ఫీని డిస్కార్డ్ చేశారు. ప్యాకేజింగ్ మెటీరియల్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని, కూరగాయల క్రేట్లు, వాటర్ బబుల్ కంటైనర్లు మురికిగా ఉన్నాయని, చాపింగ్ బోర్డులు పాడైపోయాయని, ఫ్రూట్ స్టోరేజ్ దగ్గర బొద్దింకలు కనిపించాయని గుర్తించారు. ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ ఇచ్చి, హైజీన్ స్కోర్ 110 మార్కులకు 86 మార్కులు (79 శాతం) ఇచ్చారు.