భౌరంపేట్‌లో హైడ్రా కూల్చివేతలు–రోడ్డు పక్కన షాపుల తొలగింపు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో రహదారి పక్కన ఉన్న షాపులను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉదయం ప్రారంభమైన ఈ చర్యలు, రోడ్డు పక్కన అనధికారికంగా ఏర్పాటు చేసిన షాపులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా అగ్నిప్రమాదాల సమయంలో ప్రమాదకరంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మార్చి 3న ప్రగతి నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని, భద్రతా చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్