రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన తెలపడానికి అనుమతించకపోవడంతో నిరుద్యోగులు బుధవారం హైదరాబాద్ పెద్దమ్మ గుడి దగ్గర ఆందోళన చేశారు. అక్కడి నుంచి సైతం పోలీసులు వారిని వెళ్లగొట్టడంతో వారు గాంధీ భవన్ ను ముట్టడించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.