హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. సుమారు రూ. 1.60 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నట్లు సమాచారం.