కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను శుక్రవారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో నివేదిక సమర్పణ జరిగింది. నివేదికను అధ్యయనం చేయడానికి నీటిపారుదల, న్యాయ, జీఏడీ శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సారాంశాన్ని ఆగస్టు 4న కేబినెట్‌కు నివేదించనుంది.