హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వి. సి. సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుండి మాసాబ్ ట్యాంక్ వరకు 'మోడల్ కారిడార్'గా తీర్చిదిద్దేందుకు కీలక అడుగు వేశారు. స్వయంగా బస్సులో ప్రయాణించి బాటిల్ నెక్ పాయింట్లు, ట్రాఫిక్ అడ్డంకులను పరిశీలించిన వారు, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు గురువారం సూచించారు.