గ్రామ పంచాయతీ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.619.85 కోట్ల నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులను విడుదల చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ కింద ఉన్నాయి. టైడ్ గ్రాంట్ నిధులతో రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి పనులు చేపట్టవచ్చని, అన్ టైడ్ గ్రాంట్ నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కేంద్రం ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ మంత్రాన్ని ఆచరణలో పెడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్