సైబరాబాద్ పోలీసులు న్యూ ఇయర్-2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. 21-12-2025 లోపు https://cybpms.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కమర్షియల్ ఈవెంట్లకు ఒక ఫారం, నాన్ కమర్షియల్ ఈవెంట్లకు మరో ఫారం ఉపయోగించాలని, ఫిజికల్ అప్లికేషన్లు స్వీకరించబోమని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 21 తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించారు.