హైదరాబాద్ గచ్చిబౌలి IT కారిడార్లో హైడ్రా అధికారులు మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టి, రూ.1200 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి ఖానామెట్లోని సర్వే నం.55లో 8 ఎకరాలకుపైగా ఉన్న ఈ స్థలాన్ని బడా నిర్మాణ సంస్థల ఆక్రమణల నుంచి కాపాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.