కూకట్‌పల్లిలోని ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లను ఆక్రమించిన నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. రోడ్ల ఆక్రమణల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రజల ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే స్పందించి ఆక్రమణలను తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.