పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భరోసా

కూకట్‌పల్లి నియోజకవర్గంలో నగర స్వచ్ఛత కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీసీ చాముండేశ్వరి తెలిపారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆల్విన్ కాలనీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రసాద్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో కార్మికులకు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. అధికారులు, వైద్య బృందం, కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్