డ్రైనేజీ సమస్యపై వెంటనే చర్యలు

కూకట్‌పల్లి నియోజకవర్గం న్యూ గౌతమ్ నగర్‌లో డ్రైనేజీ మ్యాన్‌హోల్ దెబ్బతినడం వల్ల మురుగు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్ స్పందించి, జలమండలి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పాత పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్