కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో, వివేకానందనగర్ ప్రధాన రహదారిపై భారీ అక్రమ షెడ్డు నిర్మాణం జరుగుతుండటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ రహదారిని ఆక్రమిస్తూ జరుగుతున్న ఈ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని, పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలతోనే అక్రమాలు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని కాలనీవాసులు హెచ్చరించారు.