ఉప్పుగూడ పరిధిలోని లలితాబాఘ్ లో మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రధాన దారిలో కాంక్రీట్ రోడ్డును తవ్వి, వరద ముంపు ప్రాంతంలో భారీ డ్రైనేజీ పైపులైను వేస్తున్నారు. మ్యాన్ హోల్స్ ను పునర్నిర్మిస్తున్నారు. ఈ పనుల వల్ల ఆ దారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుంతల్లో మురికి నీరు నిండి దోమల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.