మల్కాజిగిరి లో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత..

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను మల్కాజ్‌గిరి సర్కిల్ ఏసీపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్మాణాలను తొలగించారు. ఈ క్రమంలో, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత జరుగుతోందని దుకాణదారులు అధికారులను అడ్డుకున్నారు. సీపీఎం పార్టీ కార్యాలయాన్ని కూడా తొలగించారు. ఈ చర్యపై సీపీఎం జిల్లా కార్యదర్శి కోమటి రవి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉండే పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం హేయమైన చర్య అని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.

సంబంధిత పోస్ట్