నేరేడ్మెట్ వాయుపురిలో సోమవారం హెల్మెట్ పై ప్రత్యేక అవగాహన

నేరేడ్మెట్ వాయుపురిలో సోమవారం హెల్మెట్ ధరించడంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచేందుకు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రమాదాల్లో హెల్మెట్ ఎలా ప్రాణాలను కాపాడుతుందో వివరించారు. అనంతరం, 'హెల్మెట్ బ్యాంక్' ద్వారా వారికి తాత్కాలికంగా ఒక హెల్మెట్‌ను అందించారు.

సంబంధిత పోస్ట్