బోడుప్పల్–చెంగిచెర్లలో తాగునీటి సరఫరా ప్రెషర్ పెంచాలి

బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్లలో తాగునీటి సరఫరా తక్కువ ఒత్తిడితో జరుగుతోందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, తగిన ఒత్తిడితో నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆయన జలమండలి ఈడీ పంకజను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్