బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TMREIS వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ తో పాటు ఉద్యోగులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవం ఉద్యోగుల సంక్షేమానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.